calender_icon.png 21 October, 2024 | 6:59 AM

రుణమాఫీపై సీఎం ఏఐ అబద్ధాల టెక్నిక్

21-10-2024 12:00:00 AM

* బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ విమర్శ

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన ఎక్స్‌వేదికగా స్పందిస్తూ రుణమాఫీ చేసినట్లు ఇచ్చిన ప్రకటనలో ఏవిధంగా అయితే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రూపొందించిన చిత్రాన్ని వాడారో, రుణమాఫీ అందిన రైతుల లెక్క విషయంలోనూ సీఎం రేవంత్ అదే టెక్నిక్‌ని వినియోగించారంటూ కౌంటర్ ఇచ్చారు

. కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న 40 లక్షల మంది రైతులు అనే సంఖ్య(అనుములు ఇంటెలిజెన్స్) అనేది రేవంత్‌రెడ్డి వాడిన అబద్ధాల ఏఐ టెక్నిక్‌తో రూపొందించిందేనని ఎద్దేవా చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 40 శాతం రైతులకు కూడా రుణమాఫీ కాలేదని చెప్పారు. తరుచూ నిబంధనలు మారుస్తూ రుణమాఫీ తేదీలు మారుస్తున్నారని విమర్శించారు.