22-03-2025 10:40:14 PM
రాజంపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం, ఆరేపల్లి, బసవన్నపల్లి, అరగొండ గ్రామాలలో నిన్న కురిసినటువంటి వర్షానికి నేలకొరిగిన మొక్కజొన్న పంటలను సంబంధిత క్లస్టర్ ఏఈవోలు శనివారం సందర్శించారు. ఇందులో భాగంగా రాజంపేట మండలంలో ప్రాథమిక అంచనాగా మొత్తం26 ఎకరాల మొక్కజొన్న పంట నేలకు ఒరిగినట్టు గమనించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ శ్రుతి, రాజంపేట మండల ఏఈవోలు రైతులు పాల్గొన్నారు. పంట నష్టాలు గురించి మండల వ్యవసాయ అధికారి ఫీల్డ్ విజిట్ చేసి జరిగిన నష్టాన్ని ఉన్నత అధికారులకు తెలియజేస్తామన్నారు.