15-04-2025 12:00:00 AM
భూ భారతి, సన్నబియ్యం తదితర అంశాలపై చర్చ
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): కాంగ్రెస్ శాసన సభాపక్ష (సీఎల్పీ) సమావేశం మంగళవారం జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా భూ భారతి, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ రిజర్వేషన్ల అంశంతో పాటు ఇతర అంశాలపైన చర్చించనున్నారు. ఈ సమావేశం నోవాటెల్ హోటల్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.