calender_icon.png 10 March, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లూథియానాలో కూలిన వస్త్ర కర్మాగారం.. కొనసాగుతున్న సహాయక చర్యలు

09-03-2025 02:06:57 PM

లూథియానా,(విజయక్రాంతి): లూథియానాలోని ఫోకల్ పాయింట్ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ భవనం కూటిపోయి ఒక కార్మికులు మరిణించగా, శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. ఫ్యాక్టరీ భవనం కూలిపోయిన ఒక రోజు తర్వాత ఇంకేవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారా అని తెలుసుకోవడానికి ఆదివారం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం ఫోకల్ పాయింట్ ప్రాంతంలో ఒక వస్త్ర కర్మాగారం భవనం కూలిపోయింది.

శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురు కార్మికులను ఎన్డీఆర్ఎఫ్(NDRF) బృందాలు బయటకు తీసుకుకోచ్చిన వారిలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భవనం కూలిపోయే ముందు పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.  ఫ్యాక్టరీలో మరమ్మతు పనులు చేపడుతున్న సమయంలో ఒక స్తంభం కూలిపోయింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన రెండు బృందాలు, పోలీసులు, అగ్నిమాపక దళం, కర్మాగారాల విభాగాలు, మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఇతర బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని వర్గాలు తెలిపాయి.