13-04-2025 07:24:40 PM
చర్ల,(విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు కుమారుడు దొడ్డి హరిసాయి సింధు కుమార్తె అన్విత పుట్టిన రోజు సందర్భంగా చర్ల గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 16 మంది కార్మికులకు ఆదివారం బట్టల పంపిణీ చేశారు. భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ చేతుల మీదుగా చర్ల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా తాతారావు మనవరాలు అన్విత కు పుట్టిన రోజు శుభాకాంక్షలు, చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు పేదల కష్టాలు తెలిసిన మనిషి కనుక ఆయన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కార్మికులకు బట్టలు పళ్ళు, స్వీట్లు పంపిణీ చేసి కార్మికుల సేవలను గుర్తించడం అభినందనీయం అన్నారు.