calender_icon.png 18 November, 2024 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో పాఠశాలల మూసివేత

18-11-2024 01:19:47 AM

న్యూఢిల్లీ, నవంబర్ 1౭: దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ వాయు నాణ్యత భారీగా పడిపోతోంది. ఇప్పటికే ఢిల్లీలో మూడో దశ ఆంక్షలు విధించినా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. ఆదివారం రాత్రి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ప్రమాదకరస్థాయిలో 457కు చేరింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం 4వ స్టేజ్ ఆంక్షలను అమలుకు సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి గ్రేడెట్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ) స్టేజ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

ఇందులో భాగంగా పూర్తిగా పాఠశాలలు మూసివేయడంతో పాటు నగరంలోకి లారీలకు అనుమతి నిరాకరణ వంటి కఠిన చర్యలు ఉంటాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆన్‌లైన్‌లోనే తరగతులను నిర్వహించనున్నారు. 

వీటిపైన నిషేధం

* ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్ ఉన్న కార్లపైనా నిషేధం. బీఎస్ అంతకన్నా తక్కువ పాత డీజిల్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌కు అనుమతి నిరాకరణ

* నిర్మాణ కార్యకలాపాలు తాత్కాలిక నిలుపుదల. హైవేలు, రోడ్లు, ఇతర ప్రభుత్వ నిర్మాణాలపైనా నిషేధం.