06-03-2025 12:00:39 AM
కామారెడ్డి మార్చి 5, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్సీ కలర్స్ మెటీరియల్స్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి నిరసిస్తూ ఫ్లెక్సీ దుకాణాల యజమానులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈనెల 8 ,9 తేదీల్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ షాపుల మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
కాబట్టి ఫ్లెక్స్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫ్లెక్సీ కలర్స్ ,మెటీరియల్స్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి తప్పు పట్టారు. నూతన ధరలను పెంచడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా బంద్ పాటిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు నిర్వహించే బందుకు ప్రజలు సహకరించాలని కోరారు.