calender_icon.png 15 January, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి విజయోత్సవాల ముగింపు వేడుకలు

07-12-2024 01:02:02 AM

7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయం 

 హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ప్రజాపాలన విజయో త్సవాల ముగింపు వేడుకలను డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఘనం గా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకల్లో ప్రజలు కూడా పాలు పంచుకుని సంబురాలు జరుపుకునే విధంగా అధికా రులు కార్యక్రమాలను రూపకల్పన చేశారు.

ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వేదికగా పలు సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.  సందర్శకు ల కోసం సాంస్కృతిక, ఫుడ్, హస్తకళల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.