11-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): తన ఫోన్ ట్యాప్ అయిందంటూ రియల్టర్ చక్రధర్ గౌడ్ పోలీసులను ఆశ్రయించిన కేసులో ఏ2 నిందితుడు పి.రాధా కిషన్‌రావు దాఖలు చేసిన ముందస్తు బెయి ల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. అనంతరం న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తీర్పును వాయి దా వేశారు.
తొలుత పిటిషనర్ తరఫు న్యా యవాది తన వాదనలు వినిపిస్తూ.. ఫోన్‌ట్యాపింగ్ కేసులో కస్టోడియల్ ఇంటరాగేష న్ కోరడం అభ్యంతరకరమన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వరరావు తన వాదనలు వినిపిస్తూ.. చక్రధర్ గౌడ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను నాడు టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి పిలిపించి కొందరు బెదిరించారని, వారిని శారీరకంగా, మానసికంగా వేధించారని, ఈ వ్యవహారన్నంతా నాటి మంత్రి హరీశ్‌రావు వీడియో కాల్ ద్వారా చూశారని కోర్టుకు తెలిపారు.
దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. వేధింపులను విషయాలన్నింటినీ ఫిర్యాదులో పేర్కొనకుండా, కౌంటర్‌లో మాత్రం ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నించారు. అం దుకు పీపీ సమాధానమిస్తూ.. చక్రధర్ గౌడ్ నాడు బెదిరింపులకు భయపడి ఇవి వెల్లడించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.