సోమవారం ఒక్కరోజే 2 వేల ఓపీ
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని బీబీగనర్ ఏయిమ్స్‌కు రోజురోజుకూ ఓపీ పెరుగుతున్నది. సోమవారం ఒక్కరోజే 2 వేల ఓపీ నమోదై రికార్డు సృష్టిస్తున్నది. వైద్యం కోసం వేలాది మంది బారు లు తీరారు. ఓపీ నమోదుకు తొమ్మిది కౌం టర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, అన్ని కౌంటర్లు రద్దీగా కనిపించాయి.
ఆసుపత్రికి ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులే కాక ఉమ్మ డి వరంగల్ ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో వైద్య సేవల కోసం వస్తున్నారు. ఆసుపత్రి పరిధిలో మొత్తం 33 వైద్య విభాగాలు ఉన్నాయి. వీటి పరిధిలో వైద్యనిపుణులు నాణ్యమైన సేవలు అందిస్తుండడం, కేవలం రూ.10 నామమాత్రపు ఫీజు తీసుకుంటుండడంతో ఎక్కువ మంది తరలివస్తున్నారు.
ముఖ్యంగా తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఎక్కువగా ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటివరకు ఆసుపత్రిలో సుమారు 4 లక్షల మందికి పైగా ఓపీ వైద్య సేవలు పొందారు. అదే విధంగా అత్యవసర సేవల విభాగంలో 57,500 మంది శస్త్రచికిత్సలతో పాటు ఇతర వైద్య సేవలు వినియో గించుకున్నారు. ప్రస్తుతం అత్యవసర సేవల విభాగంతో పాటు ఓపీ సేవలు మాత్రమే ఆసుపత్రి పరిధిలో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.