calender_icon.png 26 October, 2024 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఆర్పీఎఫ్ స్కూళ్లను మూసేయండి

26-10-2024 01:32:52 AM

భారత్‌కు ఉగ్రవాది పన్నూ హెచ్చరిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌సింగ్ పన్నూ సీఆర్పీఎఫ్ స్కూళ్లను మూసేయాలంటూ హెచ్చరికలు జారీ చేశాడు. కేంద్ర హోంమంత్రికి సంబంధించిన సమాచారమిస్తే నజరానా ఇస్తానంటూ ఓ ప్రకటనను విడుదల చేశాడు. ఒకప్పటి సీఆర్‌పీఎఫ్ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్, మాజీ రా అధికారి వికాస్‌యాదవ్ తమ హక్కులను హరించారని పన్నూ ఆరోపించాడు. సిక్కులపై దాడులకు తెగబడ్డారని ఆరోపించాడు. స్వర్ణ దేవాలయంపై దాడి, 1984లో సిక్కుల ఊచకోతకు సీఆర్పీఎఫ్ పనేనని పేర్కొన్నాడు. భారత హోంమంత్రి అమిత్‌షా.. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు కిరాయి గూండాలను నియమించాడని, తన హత్యకు కుట్ర పన్నాడని ఆరోపించారు.