calender_icon.png 10 January, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లైమైక్స్ పూర్తయింది..

31-07-2024 12:23:35 AM

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తన 21వ సినిమా కోసం దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో చేయి కలిపిన సంగతి తెలిసిందే. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ముగింపు సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్టు చిత్ర బృందం తెలిపింది. హైదరాబాద్ శివార్లలో కళా దర్శకుడు బ్రహ్మ కడలి ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో ముఖ్య తారాగణంతో పాటు వెయ్యి మంది జూ.ఆర్టిస్ట్స్‌తో క్లుమైక్స్‌ని ముప్పు రోజుల పాటు షూట్ చేశారు.

ఇందులో భాగంగా యాక్షన్ కొరియోగ్రాఫర్ రామకృష్ణ నేతృత్వంలో తెరకెక్కిన పోరాట సన్నివేశాల సినిమాకి ప్రధాన ఆకర్షణ కానున్నాయని దర్శక నిర్మాతలు తెలిపారు. మొత్తంగా ఈ షెడ్యూల్ కోసం 8 కోట్లు ఖర్చు చేశారట నిర్మాతలు. విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో ‘బింబిసార’ ప్రీక్వెల్‌ను ఇటీవల ప్రకటించిన కళ్యాణ్ రామ్, తాజాగా మరో ఆసక్తికర కథకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలో వివరాలు వెలువడనున్నాయి.