మంత్రి సీతక్క
జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 6(విజయక్రాంతి): మొక్కల పెంపకంతోనే వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వయి గ్రామంలోని బుస్సాపూర్ రోడ్డు 5వ బెటాలియన్ క్యాంపులో మొక్కలు నాటారు. అనంతరం వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించా రు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య, కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ శ్రీజ, ఓఎస్డీ మహేష్‌బాబాసాహెబ్ గీతే, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్, సీఎంటీ అలేక్, డీఎస్పీ రవీందర్, మండల ప్రత్యేక అధికారి విజయచంద్ర, కాంగ్రెస్ నాయ కులు తదితరులు పాల్గొన్నారు.