calender_icon.png 14 January, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లిక్ చేస్తే అంతా ఖాళీ!

14-01-2025 01:12:53 AM

మహబూబ్ నగర్, జనవరి 13 (విజయ క్రాంతి): టెక్నాలజీ పెరుగుతోంది, సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా స్కాములకు పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మా ర్ట్‌ఫోన్లో ఉండడంతో ఖాతాలు కూడా వారి ఫోన్ల కొండసంధానం చేసిపడి ఉన్నాయి. ఈ తరంలో అవసరమైన చర్యలు తీసుకుంటేనే వారి బ్యాంకు బ్యాలెన్స్ క్షేమంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇందులో భాగంగానే తాజాగా ‘జంప్డ్ డిపాజిట్ స్కా మ్’ పేరుతో ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చిందని ప్రచారం ఊపందుకుంది. దీని ద్వారా చాలామంది ప్రజలు భారీగా డబ్బు కోల్పోతున్నారు. ఇంతకీ ఈ కొత్త స్కామ్ ఏమిటితో పట్టుపల అంశాలను అధ్యాప కులు విజయ్ కుమార్ తెలియజేశారు. 

జంప్డ్ డిపాజిట్ స్కామ్

జంప్డ్ డిపాజిట్ స్కామ్ అనేది యూపీఐ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. బాధితులను ఆకర్శించడానికి.. నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల్లో రూ.5,000 లేదా అంత కంటే తక్కువ జమచేస్తారు. ఖాతాలో డబ్బు జమ అయినట్లు ఒక నోటిఫికేషన్  రూపం లో వస్తుంది. ఆ సమయంలో బాధితుడు బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ ఓపెన్ చేసి.. పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే, నేరగాడికి యాక్సెస్ లభిస్తుంది. దీంతో ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు మాయమైపోతుంది.

జంప్డ్ డిపాజిట్ స్కామ్‌ను ఎదుర్కోవడం ఎలా?

-గుర్తు తెలియని నెంబర్ నుంచి మీ ఖాతా లో చిన్న మొత్తం జమ అయితే.. వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయవద్దు. 15 నిమి షాల నుంచి 30 నిమిషాల వరకు వేచి చూ డండి. ఆ తరువాత స్కామర్ అభ్యర్థ గడువు ముగిసిపోతుంది. -ఒకవేళా మీ ఖాతాలో డ బ్బు జమ అయిన తరువాత.. బ్యాలన్స్ చెక్ చేసుకునే సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే తప్పు పిన్ ఎంటర్ చేయండి. దీంతో స్కామ ర్ అభ్యర్థ క్యాన్సిల్ అవుతుంది.

-బ్యాంక్ బ్యాలెన్సును సంబంధించిన యాప్ నోటిఫి కెషన్స్ లేదా మెసేజస్ వస్తే.. మీరు నేరుగా బ్యాంకును సంప్రదించి, మీ అనుమా నాలను నివత్తి చేసుకోవచ్చు. -ఎప్పుడూ మీ యూపీఐ పిన్ నెంబర్ ఇతరులకు షేర్ చేయ వద్దు లేదా చెప్పవద్దు.

పిన్ నెంబర్ గోప్యం గానే ఉండాలి. -జంప్డ్ డిపాజిట్ స్కామ్‌కు సంబంధించిన కేసులు.. ఇటీవల చాలా ఎక్కువవుతున్నాయి. కాబట్టి ఇలాంటి తరహా మోసాల గురైతే.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో లేదా సైబర్ క్రైమ్ పోర్ట ల్‌లో కూడా ఫిర్యాదు చేసేందుకు అవకా శాలు ఉన్నాయి. ఉన్న అవకాశాలను సద్విని యోగం చేసుకుని తెలియని విషయాలు తెలుసుకుని ఖాతాలను భద్రంగా ఉంచుకో వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.