calender_icon.png 15 January, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్

09-08-2024 01:58:08 AM

ఆర్బీఐ గవర్నర్ ప్రకటన

చెక్కులు ఇచ్చినవారికి, తీసుకున్నవారికి ప్రస్తుతం ఆందోళనపరుస్తున్న సమయాన్ని తగ్గించి, చెల్లింపుల్ని వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్‌దాస్ ప్రకటించారు. ప్రస్తుతం చెక్కుల ప్రాసెసింగ్‌కు రెండు నుంచి మూడు రోజల సమయం పడుతుండగా, కొద్ది గంటల్లోనే చెల్లింపు జరిగేలా కొత్త చెక్కు క్లియరెన్స్ రూల్‌ను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. చెక్కు క్లియరెన్స్‌కు అవలంబిస్తున్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) ప్రకారం బ్యాచ్‌లవారీగా క్లియరింగ్ ప్రక్రియ అమలు జరుగుతున్నది. 

సీటీఎస్ నిబంధనల మార్పుతో బ్యాచ్‌లవారీ ప్రాసెసింగ్ కాకుండా ‘ఆన్ రియలైజేషన్ సెటిల్‌మెంట్’ను బ్యాంక్‌లు అనుసరిస్తాయి. దీంతో సమయం గణనీయంగా తగ్గుతుంది. ఆన్‌లైన్‌లో ఆర్‌టీజీఎస్, నెప్ట్ తరహాలో చెక్కులు త్వరితంగా ప్రాసెస్ అవుతాయి. ఈ పద్ధతి ప్రకారం బ్యాంక్ పనిగంటల్లోనే చెక్కును స్కాన్ చేసి, ప్రెజంట్ చేసి, కొద్ది సమయంలోనే పాస్ చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ వివరించారు.