నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, జనవరి 28 (విజయక్రాంతి) : సంక్షేమ హాస్టళ్లలో పరిశుభ్రతకు మరింత ప్రాధా న్యం ఇవ్వాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. పెద్దవూర మండల కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ హాస్టల్ను మంగళవారం ఆమె తనిఖీ చేశారు.
విద్యార్థినుల గదులు, టాయిలెట్స్, హాల్ను పరిశీలించారు. స్టోర్ రూమ్ శుభ్రంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజనం, కూరలకు నాణ్యమైన వంట సామగ్రి వాడాలని చెప్పారు. అంతకు పీహెచ్సీని కలెక్టర్ తనిఖీ చేసి రిజిస్టర్లు, వార్డులు పరిశీలించారు. పీహెచ్ సీ భవన నిర్మాణాన్ని మార్చిలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సరోజిని, సంక్షేమశాఖ అధికారులు తదితరులున్నారు.