08-02-2025 01:01:11 AM
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 7: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలని కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రాచాల రస్మిక రెడ్డి అన్నారు.శుక్రవారం ఉదయం వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం ప్రభుత్వ బిసి బాలుర కళాశాల వసతి గృహం మరియు ఎ & బి వసతి గృహాలలో విద్యార్థులకు మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణం మార్పుల వలన కొన్ని సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలని భోజనానికి ముందు భోజనం తర్వాత చేతులు సభ్యుతో కడుక్కోవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు ఎస్. ఆంజనేయులు, నరేందర్ రెడ్డి, వసతి గృహ సిబ్బంది వైద్య సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు