ఆదిలాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): కాలేజీ బస్సుకు విద్యుత్ తీగలు తగిలి క్లీనర్ మృతి చెందాడు. అదిలాబాద్‌లోని నలంద కళాశాలకు చెందిన బస్సు బుధవారం విద్యార్థులతో కాలేజీకి వెళ్తున్నది. అనుకుంటా గ్రామానికి వెళ్లే దారిలో బస్సుకు విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ అయింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ గాలి జనార్దన్ (45) అక్కడికక్కడే మృతి చెందగా, బస్సులో ఉన్న 10 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.