calender_icon.png 10 October, 2024 | 8:50 PM

ఇంటింటికీ శుద్ధజలం

04-09-2024 12:23:25 AM

  • తాగునీటి సరఫరాపై జలమండలి అప్రమత్తం
  • కలుషిత నీరు సరఫరా కాకుండా చర్యలు
  • నేటి నుంచి నీటి నాణ్యత పరీక్షలు రెట్టింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసిన నేపథ్యం లో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. నగర ప్రజలకు తాగునీటి సరఫరా లో ఇబ్బందులు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ నేరుగా క్షేత్రస్థాయిలో పలుమార్లు పర్యటిం చారు. సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. నీటి ద్వారా ప్రబలే వ్యాధుల నివారణకు జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. 

8.80 లక్షల క్లోరిన్ బిళ్లల పంపిణీ

కలుషిత నీరు సరఫరా కాకుండా ఉండేందుకు జలమండలి ప్రస్తుతం సేకరిస్తున్న శాం పిళ్ల కంటే రెట్టింపు శాంపిళ్లు సేకరించనున్నది. నగర పరిధిలోని పలు బస్తీలు, వరద ప్రభావిత ప్రాం తాల, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. మంగళవా రం ఈమేరకు జలమండలి అధికారులు హఫీస్‌పే ట్‌లోని సాయినగర్, యూత్‌కాలనీ, మజీద్‌బండ, ఇజ్జత్ నగర్ ప్రాంతాలను సందర్శిం చారు. ఇప్పటివరకు నగరంలో 8.80లక్షల క్లోరిన్ బిళ్లలు పంపిణీ చేశారు. ముంపునకు గురైన ప్రాంతా ల్లో మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. దీనికి తోడు అవసరమైన ప్రాంతాల్లో బ్లీచిం గ్ పౌడర్ పంపిణీ చేస్తున్నారు. కలుషిత నీరు, ఇతర సమస్యలను కస్టమర్ కేర్ నంబ ర్ 155313కి కాల్ చేసి వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు.

మూడంచెల్లో నీటి నాణ్యత పరీక్షలు..

జలమండలి ఆధ్వర్యంలో ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీస్ రిజర్వాయర్ల వద్ద మూడంచెల్లో నిరంతరం క్లోరినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది వినియోగదారులకు నీరు చేరే సరికి 0.5 క్లోరిన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ

వర్షాలు తగ్గేవరకు నగరంతో పాటు ఓఆర్‌ఆర్ పరిధిలోని వాటర్ లాగింగ్ పాయిం ట్లు, ఓవర్‌ఫ్లో, కలుషిత నీరు తదితర అంశాలను పర్యవేక్షించేందుకు జలమండలి ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిం ది. కమిటీలో సర్కిల్ 4, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, సర్కిల్ 1, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, సర్కిల్ 5, డైరెక్టర్ 2 స్వామి, సర్కిల్ 4 ఆపరేషన్ డైరెక్టర్ 1 విజయరావు, సర్కిల్ 3, 6(ఓఆర్‌ఆర్‌పరిధి) పర్సనల్ డైరెక్టర్ సుదర్శన్ ఉన్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలోకి తాగునీటి సరఫరాను పర్యవేక్షించనున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ ఏ, విద్యుత్ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తారు.

జాగ్రత్తలు తీసుకుంటున్నాం

నగర ప్రజలకు శుద్ధజలం అందించేందుకు ఐఎస్‌వో 10500- 2012 ప్రకారం శాస్త్రీయమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కలుషిత నీరు సరఫరా కాకుండా తీసుకునే చర్యల్లో భాగంగా ప్రస్తుతం సేకరిస్తున్న శాం పిళ్ల కంటే రెట్టింపు శాంపిళ్లు సేకరిస్తాం. మ్యాన్‌హోళ్ల నుంచి మురుగు పొంగకుండా చర్యలు చేపడుతు న్నాం. మ్యాన్‌హోళ్లు పొంగితే వెంటనే పూడిక తీసి సిల్ట్‌ను తొలగిస్తున్నాం. 

 అశోక్‌రెడ్డి, జలమండి ఎండీ