15-04-2025 09:13:18 AM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం నాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం(Congress Legislature Party meeting) జరగనుంది. ఉదయం 11 గంటలకు శంషాబాద్ నోవాటెల్(Shamshabad Novotel)లో సీఎల్సీ సమావేశం నిర్వహించనున్నారు. సీఎల్సీ సమావేశంలో నాలుగు ముఖ్యాంశాలపై ప్రధానంగా చర్చించున్నారు. భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ-ఎస్టీ వర్గీకరణపై చర్చించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. భూభారతి పోర్టల్ పై నిన్న కలెక్టర్లతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, తాగునీటి సరఫరా అంశాల్లో నిర్లక్ష్యం సహించమని హెచ్చరించారు. ఎక్కడా లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు రేవంత్ ఆదేశించారు. భూభారతి చట్టంపై కలెక్టర్లకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. ప్రతి మండలంలోనూ భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించి కలెక్టర్లు వాటికి హాజరు కావాల్సిందేనని సీఎం రేవంత్ తేల్చిచెప్పారు.