మందమర్రి, (విజయక్రాంతి): పట్టణంలోని పాత బస్టాండ్ లో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మేముసైతం స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు బూబత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులనే ప్రతిష్టించి పూజించాలని కోరారు. కెమికల్ కాలుశ్యానికి కారణమవుతున్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన గణపతి విగ్రహాల తయారీను సంబందిత అధికారులు శాశ్వతంగా ఆపేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బోరిగం వెంకటేష్, అగుళ్ల తిరుమలేష్, వడ్ల రవి, సతీష్, తుర్లపాటి సోమయ్య, మెరుగు తిరుపతిలు పాల్గొన్నారు.