21-04-2025 08:41:42 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని నవ లిమిటెడ్ తన సామాజిక కార్యకలాపాలలో భాగంగా కేశవాపురం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదుల,వాష్ రూమ్స్ ను సోమవారం కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాభివృద్ధికి నవ లిమిటెడ్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు.
అనంతరం పట్టణ పరిధిలోని పాలకోయ తండాలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సురక్షిత మంచినీటి కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దాని నిర్వహణను మున్సిపల్ కమిషనర్ కే సుజాతకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో నవ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఎంఈఓ రామమూర్తి, పాల్వంచ ,తహసిల్దార్ వివేక్ ,డీ. సి ఎం చైర్మన్ కే .శ్రీనివాసరావు ,లైసెన్ ఆఫీసర్ ఖాదరేంద్రబాబు , ఎన్. శ్రీనివాస్ సివిల్ ఇంజనీర్ , సిహెచ్ శ్రీనివాసరావు, ఏ పి పి రమేష్, షాబీర్ పాషా మరియు ప్రభుత్వ అధికారులు , గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.