calender_icon.png 3 April, 2025 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

01-04-2025 12:00:00 AM

25 సంవత్సరాల తర్వాత కలిసిన క్లాస్ మెంట్స్ 

జీలచెరువులో పూర్వ విద్యార్థుల మధుర జ్ఞాపక సమ్మేళనం

హృదయాన్ని తడిపిన వీడ్కోలు

కూసుమంచి,  మార్చి 31:- పాతికేళ్ల కిందట బడిలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు పాతకేళ్ళ తర్వాత మళ్లీ ఒక వేదికద్వారా కలిశారు. కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలో చదువుకున్న 2000 బ్యాచ్ కు సంబంధించిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంను సోమవారం జీళ్ళచెర్వు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో   నిర్వహించారు. పదో తరగతి పూర్తయ్యాక ఎవరి దారిలో వారు వెళ్లారు.

కొందరు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడగా, మరి కొందరు వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతు న్నారు.2000 బ్యాచ్ కి చెందిన విద్యార్థి ఐ నరేష్, కృష్ణకుమారి, రాజీవ్, శ్రీనివాసరావు, వీరభద్రం, వీర రాఘవులు,రాంగోపాల్, వెంకటేశ్వర్లు, అనిత, సరస్వతి, విక్రమ్, దేవేందర్, సైదులు  మరి కొంతమంది స్నేహితుల సహకారంతో  తమ బాల్య మిత్రులు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో కొంతమంది వివరాలు సేకరించి వారికి వర్తమానం పంపి సోమవారం జీళ్ళ చెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయుటకు  విద్యార్థులు ఎంతగానో కృషి చేశారు.తమ సహ విద్యార్థిని కృష్ణకుమారి, రాజీవ్  నుంచి పిలుపు అందుకున్న అప్పటి విద్యార్థినీ, విద్యార్థులంతా ఎంతో ఆనందంతో తమకు జీవితంలో వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి 25 వసంతాల నిరీక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

విద్యాబుద్ధులు నేర్పిన గురువులైన రాజయ్య,, సీతారాములు, వీరస్వామి, సుజాత, అనిత,లలిత, పద్మ, శ్రీనివాసరావు గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపకలను బహుకరించారు. నాడు చెప్పిన చదువులతోనే తాము ఈ స్థాయికి ఎదిగామని పేర్కొన్నారు. ఓకే చెంతకు చేరి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతం చేసిన తమ సహా విద్యార్థి ను లను సత్కరించారు.  కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఈ వీరబాబు, గోపయ్య, ఎన్ సత్యనారాయణ, రాంబాబు, చంద్రశేఖర్, రంగయ్య, వెంకన్న, డి సైదులు, కనకదుర్గ, సునీత, ఉపేంద్రమ్మ, శైలజ, సంధ్య, భరత్, అప్పారావు, సుధాకర్, టి నరేష్, ఎన్. వీరబాబు తదితరులు పాల్గొన్నారు.