19-03-2025 08:39:07 PM
కాటారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ..
కాటారం (విజయక్రాంతి): మాదిగ జాతిపితైన మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పోరాట ఫలితం కారణంగానే ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైందని కాటారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కాటారం మండలంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి స్వీట్లు తినిపించుకున్నారు.
రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లలో వెంటనే ఏబిసిడి వర్గీకరణను అమలు చేయాలని మంతెన చిరంజీవి మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది మాదిగ జాతి గర్వించే శుభపరిణామమని మాదిగలు, మాదిగ ఉపకులాల ప్రజలు సంబరాలు చేసుకోవాలని చిరంజీవి మాదిగ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ సీనియర్ నాయకులు చంద్రగిరి అశోక్, మండల ఉపాధ్యక్షుడు మంతెన శ్రావణ్, మంతెన శ్రీనివాస్, కోలుగూరి రాజు, కుమార్, తదితరులు పాల్గొన్నారు.