13-03-2025 01:28:28 AM
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : ఎస్సీ వర్గీకరణ పాత నోటిఫికేషన్లకు వర్తించదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందే ప్రభుత్వం నోటిఫికేషన్ వేసిందన్నారు. బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎమ్మార్పీఎస్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బద్నాం చేయడానికే మంద కృష్ణమాదిగ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.
మాదిగలందరూ సీఎం రేవంత్‌రెడ్డి వెంటే ఉన్నారని, వర్గీకరణను ఆపడానికి కృష్ణమాదిగ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో సతీశ్ మాదిగ, కృపాకర్ మాదిగ, మేరి మాదిగ, గడ్డ యాదయ్య, డాక్టర్ మీసాల మల్లేశం, సింగిరెడ్డి పరమేశ్వర్, పాలడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.