calender_icon.png 20 November, 2024 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖాళీ కడుపుతో క్లాసులా?

20-11-2024 01:10:40 AM

  1. ‘పది’లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు
  2. రెండు పూటలా స్నాక్స్ ఇచ్చిన గత ప్రభుత్వం
  3. ఈసారి బడ్జెట్ విడుదల చేయని విద్యాశాఖ
  4. అర్ధాకలితో హాజరవుతున్న విద్యార్థులు!
  5. కొన్నిచోట్ల డీఈవోలు, హెచ్‌ఎంల చొరవతో అల్పాహారం

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా డీఈవోలు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈమేరకు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో టెన్త్ విద్యార్థులకు సాయంత్రం వేళ స్పెషల్ క్లాసులు నిర్వహిస్తు న్నారు. కాగా ఈ తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు ఖాళీ కడుపుతో హాజరవుతున్నారు.

ఈ విద్యా సంవత్సరం 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రతీ రోజు సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రతీ ఏడాది దసరా సెలవుల తర్వాత ప్రారంభ మయ్యే క్లాసులు ఈసారి కాస్త ఆలస్యంగా షురూ అయ్యాయి. గత విద్యా సంవత్సరంలో రెండు పూటలా అల్పాహారం పెడుతూ స్పెషల్ క్లాసులు జరపగా.. ఈసారి కూడా అలాగే చేస్తే విద్యార్థు లు మరింత ఉత్సాహంతో చదివే అవ కాశం ఉంటుంది.

లేదంటే మధ్యా హ్నం భోజనం చేసి పొద్దుపోయే వరకు ఉండి ఖాళీ కడుపుతోనే స్పెషల్ క్లాసులు వినాల్సి వస్తుంది.  వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి ఉపాధ్యాయుల కొరత వల్ల కొందరు విద్యార్థులు చదువులో వెనకబడుతున్నారని గ్రహించిన విద్యాశాఖ.. ఇటీవల టీచర్లను సర్దు బాటు చేసింది.

దీంతోపాటు స్పెషల్ క్లాసులు నిర్వహించి చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి విద్యార్థి వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యా యులు బోధి స్తూ.. వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుపై రోజూవారీగా స్లిప్ టెస్టులు పెడుతూ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు.

2023 విద్యాసం వత్సరం ‘పది’ ఫలి తాల్లో మోడల్ స్కూల్స్ 95.06 శాతం, కేజీబీవీలు 93.06 శాతం, ఎయిడెడ్‌లో 88.61 శాతం, జెడ్పీ స్కూళ్లు 86.03 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 80.18 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిం చారు. ఈసారి వందశాతం ఫలితా లు సాధించే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

గతేడాది ప్రత్యేక బడ్జెట్.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,785 ప్రభుత్వ, జెడ్పీ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు లక్షన్నర మందికిపైగా ఉంటారు. గత విద్యాసంవత్సరంలో వీరికి స్పెషల్ క్లాసులు రెండు పూటలా నిర్వహించారు. పాఠశాల ప్రారంభానికి గంట ముందు, సాయంత్రం గంట సేపు బోధిస్తూ.. ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ పెట్టేవారు.

ఇందుకోసం విద్యాశాఖ గతే డాది ప్రత్యేక బడ్జెట్‌ను కూడా విడుదల చేసింది. ఒక్కో విద్యార్థికి యూనిట్ ఖర్చుగా రోజుకు రూ.15గా నిర్ణయించి డీఈవోలకు అవసరమైన బడ్జెట్‌ను అప్పట్లో విడుదల చేశారు. కానీ, ఈ విద్యాసంవత్సరంలో స్నాక్స్‌కు బడ్జెట్ ఇంకా విడుదల చేయలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు.

డిసెంబర్ వరకు సాయం త్రం వేళ, జనవరి నుంచి రెండు పూటలా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి. గతంలో ఉదయం 9.30 గంటలకు పాఠశాలలు ప్రారంభమ వుతుండగా విద్యార్థులను గంట ముందుగా రమ్మనేవారు. కానీ, ప్రస్తుతం 9 గంటలకే ప్రారంభమవుతుం డడంతో ఉదయం వేళ స్పెషల్ క్లాసుల నిర్వహ ణ సాధ్యపడదని పలు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.

జనవరి లేదా ఫిబ్రవరి నుంచి విద్యార్థులకు రెండు పూటలా స్పెషల్ క్లాసులు చెబుతూ స్నాక్స్ ఇస్తా మని అధికారులు చెబుతుండడం గమనార్హం. అయితే కొన్ని చోట్ల డీఈవోలు, హెచ్‌ఎంల చొరవతో.. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారంతో విద్యా ర్థులకు స్నాక్స్ అందజేస్తున్నారు.