మెదక్,(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో నూతన మెడికల్ కళాశాల తరగతి గదులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఇంచార్జీ మినిస్టర్ కొండా సురేఖతో కలిసి గురువారం ప్రారంభించారు. మంత్రులకు కాంగ్రెస్ స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, కాలేజీ ప్రిన్సిపాల్ డా.రవిందర్ ఘన స్వాగతం పలికారు.
మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు,ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కళాశాలలో కలియ తిరిగి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనరసింహ, ఇంచార్జీ మినిస్టర్ కొండా సురేఖ ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పలు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.