29-04-2025 05:31:44 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పడా అని ఎదురుచూస్తోన్న పదో తరగతి ఫలితాల(SSC Results) విడుదలకు డేట్ ఫిక్స్ అయ్యింది. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రవీంద్ర భారతి ఆడిటోరియంలో విడుదల చేయనున్నారు. కాగా, పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగ్గా... ఈ పరీక్ష దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.