calender_icon.png 20 February, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు 10వ తరగతి టర్నింగ్ పాయింట్..

17-02-2025 10:41:21 PM

కష్టపడి చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలి..

సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు..

సంగారెడ్డి (విజయక్రాంతి): 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. సోమవారం బిహెచ్ఈఎల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మిక తనికీ చేశారు. పదవ తరగతి క్లాస్ రూమ్ ని సందర్శించి పిల్లలతో మాట్లాడి పదవ తరగతి పరీక్షలపై అవగాహన కల్పించారు. మీరు పది సంవత్సరాల తరువాత ఎటువంటి ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో, ఆ ఆలోచనకు ఇప్పుడే అంకురార్పణ చేసేసుకోవాలని అన్నారు. జీవితంలో నిలదొక్కుకొనేందుకు పదవ తరగతి పరీక్షలు టర్నింగ్ పాయింట్ అన్నారు. ప్రణాళిక బద్దంగా చదవి ఉత్తమ ఫలితాలు సాదించాలని సూచించారు. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకుండా, లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో బాగా చదివి ఉన్నత స్థానాలలో నిలబడి ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు.

కష్టపడుతూ, ఇష్టపడి చదువుకోవాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ పదవ తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. తరగతి గదిలో విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. పదిలో, పదికి పది పాయింట్లు సాధించాలని అన్నారు. పాఠశాల వంట గదిలను, మధ్యాహ్న భోజనం నాణ్యతను పారిశీలించారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ లను పరిశీలించారు. పాఠశాలలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుక ఉన్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఈఓ వెంకటేశ్వర్లులు, తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి, ఏంఈ, ఓపిపి రాథోడ్ ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.