calender_icon.png 31 March, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

21-03-2025 12:55:15 AM

  • మండలంలో పరీక్ష రాయనున్న 510 మంది విద్యార్థులు 

పగడ్బందీ ఏర్పాట్లను చేసిన విద్యాశాఖ 

మహబూబాబాద్ మార్చి 20: (విజయ క్రాంతి) మహబూబాబాద్  జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి వార్షిక పరీక్షలు నేటితో ప్రా రంభం కానున్నాయి. జిల్లాలోని గూడూరు మండలం వ్యాప్తంగా 14 పాఠశాలలో నుం డి 510 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా అందులో 244 మంది బాలు రు 266 మంది బాలికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కాగా ఇంటర్మీడియట్ పరీక్షలు 20 తో ముగియగా మండలంలోని నాలుగు కళాశాలలకు చెందిన ఇంటర్ విద్యార్థులు స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈనెల ఐదు నుండి పరీక్షలు రాస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన తెల్లవారి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి మండలంలోని వివిధ యాజమా న్యాల కింద నడుస్తున్న 14 ఉన్నత పాఠశాలలకు చెందిన 510 మంది విద్యార్థులు ఈ సంవత్సరం ఎస్‌ఎస్సి వార్షిక పరీక్షలకు హాజరవుతున్నారు.

అందుకొరకు గూ డూరు మండల కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలను నిర్వహించారు ఇందులో గూ డూరులోని బాలుర ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాల చంద్రు గూడెం ప్రాం తంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలుగా కొనసాగనున్నాయి.

ఈ మూడు పాఠశాలలకు చెం దిన పదో తరగతి విద్యార్థులతో పాటు తీగలవేణి అయోధ్య పురం మచ్చర్ల పొనుగోడు జడ్పీ ఉన్నత పాఠశాలలో దామర వంశ గిరిజన గురుకులం బ్రాహ్మణపల్లి కేజీబీవీ మరి మిట్ట ఎం జి పి పాఠశాల గూడూరు సీతానాగారం మట్టవాడ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల స్థానిక అరవింద విద్యాలయం తో కలిపి మొత్తం 14 విద్యాలయాల నుండి 510 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు.

పాఠశాలలో నెలకొన్న  వసతి సౌకర్యాలు ఇప్పటికే స్థానిక రెవిన్యూ అధికారులు పరిశీలించగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన సౌకర్యా లు ఏర్పాటు చేయాలని పరీక్ష కేంద్రాలు నిర్వాహకులకు విద్యాశాఖ సూచించింది. అదేవిధంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ పనులు చేపడుతుండగా పరీక్షా కేంద్రాల్లో పరిసరాలు మందు జాగ్రత్త చరిగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు.

ఇదిలా ఉండగా పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించనున్న వారి తు ది జాబితా కూడా బుధవారం నాటికి పూర్తి చేసినట్లు తెలిసింది. గూడూరు బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో సిఎస్సిగా పీజీ హెచ్ ఎం శ్రీనివాస్ డివో గా జంకిలాల్ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో సిఎస్సిగా ఆ పాఠశాల హెడ్మాస్టర్ సుజాత డివోగా సాంబయ్య చంద్రగూడెం గిరిజన బాలికల ఏ హెచ్ ఎస్ పరీక్ష కేంద్రంలో సిఎస్సి వీరస్వామి డిఓగా డి బద్రులాలను అధికారులు నియమించినట్లు తెలిసింది.