calender_icon.png 23 February, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ వీడియో స్పీచ్ అంతర్జాతీయ పోటీల్లో పదో తరగతి విద్యార్థి ప్రతిభ

23-02-2025 03:09:34 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలం సూరయ్య పల్లి గ్రామంలోని మేరీ మీడియా ట్రిక్స్ పాఠశాలలో ఇందారపు సాత్విక్ అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నారు. గాంధీ సొసైటీ అమెరికా ఇండియాలో నేషనల్ యూత్ ప్రాజెక్టు వారు నిర్వహించిన గాంధీ వీడియో స్పీచ్ అంతర్జాతీయ పోటీలో ప్రత్యేక బహుమతి ప్రతిభ చాటారు. విద్యార్థి రూ. 10. 000 మరియు ప్రశంసా పత్రము  సాధించినందుకు పాఠశాల యాజమాన్యము మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. గత సంవత్సరం ఇదే విద్యార్థి రాష్ట్రస్థాయి ఉపన్యాస పోటీలో  పాల్గొని తృతీయ బహుమతిని సాధించడం పాఠశాలకే గర్వకారణమని, ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి వారిని ఇటువంటి పోటీలలో పాల్గొనడానికి ప్రోత్సహించడంలో మేరీ మీడియట్రిక్స్ పాఠశాల యాజమాన్యం ఎల్లప్పుడూ ముందడుగు వేస్తుందన్నారు.