22-02-2025 01:05:31 AM
అదనపు కలెక్టర్ వీరారెడ్డి
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 21 ( విజయ క్రాంతి ): మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 4 వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మినీ మీటింగ్ హాల్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిం చారు.
ఈ సందర్భంగాఅదనపు కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో పడవ తరగతి పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగుతాయని, ఈ పరీక్ష కోసం జిల్లాలో 50 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పదవ తరగతి రాసేందుకు జిల్లాలో 8,631 మంది విద్యార్థి, విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని, ఉదయం 8.30గంటల వరకే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అన్నారు.
ప్రశ్నాపత్రాల కవరు శీలు తీయటం, జవాబు పత్రాలను కవరులో ఉంచి శీలు వేయడం సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. పరీక్ష అయిపోయిన తదుపరి జవాబు పత్రాలు సరిగా పార్సెల్ చేసి డిఆర్డిసికి ఎస్కార్ట్ ద్వారా జాగ్రత్తగా తీసుకొని వెళ్లాలన్నారు. ఈ సమావేశంలో భువనగిరి, చౌటుప్పల్ ఆర్ డి ఓ లు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, ఏ సి పి రమేష్,జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రోజా రమణి , జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, జిల్లా ట్రెజరీ అధికారి సంపూర్ణ,మున్సిపల్ కమిషనర్ రాజలింగం,జిల్లా వైద్య అధికారి మనోహర్ , తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.