calender_icon.png 4 March, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించాలి

04-03-2025 01:48:45 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట. మార్చి 3(విజయక్రాంతి) ః పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెలలో జరుగబోతున్న పరీక్షలను సజావుగా నిర్వహించాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను అదేశించారు.ఎక్కడ కూడా రూల్స్ కు విరుద్ధంగా పని చేయరాదని, నియమ నిబంధనలు అతిక్రమించకుండా పరీక్షలు నిర్వహించాలని అమ్మాయిలను చెక్ చేయటానికి ప్రతి సెంటర్లో ప్రత్యేకమైన కేబినెట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

సిఎస్ ,డివోలు, ఇన్విజిలేటర్ మొబైల్ ఫోన్లు ,స్మార్ట్ వాచెస్, తీసుకుని రాకూడదని అదేవిధంగా పరీక్ష రాసే అభ్యర్థులను కూడా ఎలక్ట్రానిక్ గార్డెన్స్ అనుమతించకూడదని వారికి సూచించారు.ఎగ్జామినేషన్లో పాలుపంచుకునే ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని పరీక్షలను సజావుగా నిర్వహించాలని సూచించారు.  అనంతరం డిఈ ఓ గోవింద్ రాజులు మాట్లాడుతు పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాల్లో 39కేంద్రాలు ఎంపిక చేయబడ్డాయని అలాగే జిల్లాలో మొత్తం 7637 విద్యార్థులు రెగ్యులర్ గా 65 గురు విద్యార్థులు వన్స్ ఫెయిల్డ్ అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారని తెలిపారు.

ఈపరీక్షల నిర్వహణ కోసం 39గురు చీఫ్ సుపరింటెండెట్లు, 39డిపార్ట్ మెంటల్ అధికారులు, 6గురు కష్టోడియన్లు ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించినట్లు అయన తెలిపారు.కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ కృష్ణ రెడ్డి, బాలాజీ లు ఏ సి జి ఈ శ్రీ ఆంజనేయులు , సెక్రటరీ రాజేందర్ కుమార్, యాదయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు.