calender_icon.png 20 April, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి పర్యటనలో తోపులాట

08-04-2025 12:41:40 AM

  1. కార్పొరేటర్లతో పోలీసుల అమర్యాద ప్రవర్తన..

గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి

ఎల్బీనగర్, ఏప్రిల్ 7 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో సోమవారం జరిగిన మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో గందరగోళం నెలకొన్నది. ప్రోటోకాల్ ప్రకారం కార్పొరేటర్లను ఆహ్వానించాల్సిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకు న్నారు. మంత్రి పర్యటనను కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు సొంత పార్టీ కార్యక్రమంగా భావించి, వందలమంది కార్యకర్తలు తరలివచ్చారు. మంత్రి పర్యటనలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

కాగా, కొత్తపేట డివిజన్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఎంపీ  ఈటల రాజేందర్, కార్పొరేటర్లు బద్దం ప్రేమ్ మహే శ్వర్ రెడ్డి, నాయకోటి పవన్, రంగా నర్సింహా గుప్తాకు కనీసం మర్యాద ఇవ్వలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. దీనిపై కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రోటోకాల్ విష యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో గందరగోళం జరిగిందన్నారు.

స్థానిక ప్రజా ప్రతినిధులుగా, కార్పొరేటర్లుగా ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుని అధికారుల చుట్టూ తిరిగి.. పనులకు నిధులు మంజూరు చేయిస్తే రాజకీయాలకు  కొంతమంది నాయకుల స్వలాభం కోసం ప్రోటోకాల్ విషయంలో గందరగోళం సృష్టించారని విమర్శించారు. కార్పొరేటర్లతో పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీస్ అధికారులపై ఉందన్నారు.