14-03-2025 11:01:10 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో కత్తిపోట్లు కలకలం రేపాయి. నూతనంగా ఏర్పడిన బోరజ్ మండలంలోని గూడ - రాంపూర్ గ్రామస్థుల యువకుల మధ్య జరిగిన గొడవ కత్తిపోట్లుకు దారి తీశాయి. శుక్రవారం రాత్రి హోలీ పండుగ సందర్భంగా రాంపూర్ కు చెందిన ఐదుగురు యువకులు గూడ గ్రామంలో ఇద్దరి యువకులతో గొడవ కాస్త కత్తిపోట్ల కు దారి తీసాయి. ఈ ఘటనలో గూడ కు చెందిన అజయ్, అశోక్ అనే యువకులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.