10-04-2025 12:14:52 AM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధికారులకు మధ్య వాగ్వాదం
బోథ్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): బోథ్ మండలంలోని కుచులాపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అధికారుల మధ్య వాగ్వా దం నెలకొంది. బుధవారం ఎంపీడీవో రమే ష్, హౌసింగ్ అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 400 నుండి 500 ఎస్. ఎఫ్.ఫ్టి స్థలంలోనే నిర్మించాలని అలాగే గోడల నిర్మాణానికి సిమెంటు బ్రిక్స్ వాడాలని అధికారులు సూచించగా లబ్ధిదారులు వ్యతిరేకించా రు. అధికారులు మాట మారుస్తున్నారని విమర్శించారు. లబ్ధిదారుడు తనకు చెందిన స్థలంలో రెండు లేదా మూడు బెడ్ రూములు గాని కట్టుకుంటాడని ఇంత స్థలంలో మాత్రమే కట్టుకోవాలని సూచించడంలో మతలబేంటి అని లబ్ధిదారులు ప్రశ్నించారు.
సిమెంట్ బ్రిక్స్ నాసిరకంగా ఉన్నాయని, వాటి స్థానంలో ఎర్ర ఇటుకలను వాడుతామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయలను లబ్ధిదారులకు ఇవ్వాలని అన్నారు. ఇల్లు నిర్మాణ సమయంలో లేని నిబంధనలు బేస్మెంట్ పూర్తయిన తర్వాత ఎలా వచ్చాయని నిలదీశారు. దింతో కాసేపు అధికారులకు లబ్ధిదారులకు మధ్య వాగ్వాదం నెలకొంది. కాగా కూచులాపూర్ గ్రామానికి 232 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు కాగా 9 ఇళ్ళు బేస్మిట్ పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు.