05-04-2025 09:32:48 PM
కిష్టంపేట రేషన్ షాప్ వద్ద ఘటన
చెన్నూర్,(విజయక్రాంతి): చెన్నూరు మండలం కిష్టంపేట రేషన్ షాప్ వద్ద శనివారం కాంగ్రెస్, బిజెపి నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం సందర్భంగా బిజెపి నాయకులు కేంద్రం నిధులతోనే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి రేషన్ షాప్ వద్ద నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రేషన్ షాప్ వద్ద నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి నాయకులు పాలాభిషేకం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషన్ షాపు వద్దకు చేరుకొని నరేంద్ర మోడీ ఫ్లెక్సీలు కింద పడవేయడంతో బిజెపి, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసులు స్పందించకుంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు చర్చించుకున్నారు.