calender_icon.png 30 September, 2024 | 7:45 AM

జన్యు మార్పిడి పంటలపై కేంద్ర ప్రభుత్వంతో ఢీ

30-09-2024 02:02:25 AM

విత్తనాభివృద్ధ్ది సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): జన్యుమార్పిడి పంటలతో పర్యావరణంతో పాటు ప్రజారోగ్యానికి ముప్పు వాటి ల్లే ప్రమాదం ఉందని రాష్ట్ర విత్తనాభివృద్ధ్ది సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి పేర్కొ న్నారు. ఆదివారం నగరంలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన జన్యు మార్పిడి పంటలపై దక్షిణాది రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

జన్యు మార్పిడి విత్తనాలతో రైతుకు ఉన్న విత్తన స్వాతంత్రత కోల్పోవడంతో పాటు విత్తనం కార్పొరేట్ రంగాల చేతుల్లోకి వెళ్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జన్యు మార్పిడి పంటల ఆలోచన విధానానికి స్వస్తి పలికేలా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

తమి ళనాడు, పాండిచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదే శ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివి ధ రైతు సంఘాల నాయకులు సమావేశానికి హాజరై జన్యు మార్పిడి విధానాన్ని వ్యతిరేకించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ నాయకుడు కోదండ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు, రైతు స్వరాజ్య వేదిక సంఘం ప్రతినిధులు కవిత, రవి, తమిళనాడు రైతు సంఘం ప్రతినిధులు పీఎన్ పాండ్యన్, సుందర విమల నందన్, కర్నాటక రైతు సంఘం ప్రతినిధి బాలకృష్ణన్, కేరళ రైతు సంఘం ప్రతిని ధులు బిజు, ఉష, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ రైతు సంఘం నేతలు సాగ ర్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.