calender_icon.png 8 November, 2024 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధ్యక్ష పదవి కోసమే బావబామ్మర్దుల కొట్లాట

04-11-2024 02:22:44 AM

  1. ఎక్స్ వేదికగా కేటీఆర్‌ది తప్పుడు ప్రచారం  
  2. బీజేపీలో మహేశ్వర్‌రెడ్డికి స్థానం లేదు 
  3. ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ రిటైర్ అయ్యాడని, దాంతో అధ్యక్ష పదవికి ఒకటే వేకెన్సీ ఉండటంతో బావాబామ్మర్థులు దాని కోసం తన్నుకుంటున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రాజభోగాలు అనుభవించిన హరీశ్‌రావు, కేటీఆర్‌లకు పది నెలలుగా నిద్రపట్టడ లేదని ఆయన విమర్శించారు.

పదేళ్ల పాలనపై, పది నెలల పాలనపై జనంలో ఇప్పుడు చర్చ జరుగుతోందని అన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో కొలువు కొట్లా ట మొదలైందని, పార్టీ అధ్యక్ష పదవి కోసం టిల్లు.. సొల్లు పోటీ పడుతున్నారని  ఎద్దేవా చేశారు. ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు ప్రభుత్వంపై విషం చిమ్ముదామా? అని బావాబామ్మర్దులు చెరో దిక్కు ఉరుకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్స్‌లో యాక్టివ్‌గా ఉంటున్న కేటీఆర్‌పై ఎలాన్ మస్క్ సంతోషంగా ఉన్నారని ఆయన ఎద్దే వా చేశారు. ఎక్స్‌లో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న కేటీఆర్‌కు ఎక్స్ ప్రధాన కార్యాలయంలో సన్మానం చేయాలని ఎలా న్ మస్క్‌ను  చామల కోరారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికి అమలు చేసే దిశగా పది నెలలుగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం తోనే కేసీఆర్ సీఎం, కేటీఆర్ మంత్రులు అయ్యారని, ఉమ్మడి రాష్ట్రంలో హరీశ్‌రావు ఎమ్మెల్యే కాకున్నా అప్పటి కాంగ్రెస్ ప్రభు త్వం మంత్రిగా అవకాశం ఇచ్చిందని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు కాబట్టే.. తెలంగాణ ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కమీషన్లు, కలెక్షన్లు, ఎలక్షన్లు అనే విధంగా సాగిందని ఆరోపించారు. ప్రగతి భవన్, సచివాలయంలో రావడానికి పేదోడికి అవకాశం కూడా ఉండే ది కాదని మండిపడ్డారు.

16 ఏళ్ల తర్వాత సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, 10 ఏళ్లలో మీరు చేయలేనిది , 10 నెలల్లో తమ ప్రభుత్వం చేసి చూపిందని అన్నారు. హరీశ్‌రావు, కేటీఆర్ కొట్లాట తెలంగాణ యువత కోసం కాదని, బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి కోసమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో 1.92 లక్షల ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని పే రివిజన్ కమిటీ చెప్పి నా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎందు కు భర్తీ చేయలేదని ఆయన నిలదీశారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 50 వేల ఉద్యోగాల వరకు భర్తీ చేశామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జడ్పీటీసీ నుంచి కష్టపడి సీఎం వరకు ఎదిగారని తెలిపారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డికి ఆ పార్టీ ఆఫీసులో కుర్చీనే లేదని, అందుకే మతిస్థిమితం లేకుండా సీఎం రేవంత్‌రెడ్డిపై మాట్లాడుతున్నారని  చామల మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.