ఆధిపత్యం కోసం పట్టు పట్టిన ఇరు వర్గాలు
గద్వాల ( వనపర్తి ),(విజయక్రాంతి ): వడ్ల కొనుగోలు సెంటర్ లను ఐ కేపీ సెంటర్ ద్వారా రైతుల నుండి వడ్ల కొనుగోలు ప్రభుత్వం నిర్వహిస్తుండగా గద్వాల మండలం బీరోల్లి గ్రామం లో అధికార పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి వడ్ల కొనుగోలు సెంటర్ లో గొడవకు దిగారు. వడ్ల కొనుగోలు సెంటర్ తమ వర్గానికే ఇవ్వాలని కొనుగోలు సెంటర్ ప్రారంభం కాకుండా ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. గత సంవత్సరం మహిళా సంఘాల వారికే వడ్ల కొనుగోలు సెంటర్ ను ఈ సంవత్సరం కూడా ఇవ్వాలని కొందరు పట్టు పడగా....రాజకీయ కారణంగానే బీరోల్లి గ్రామ కొనుగోలు సెంటర్ ను ఈ సంవత్సరం వేరే మహిళా గ్రూప్ లకు ఇచ్చారాని గత సంవత్సర మహిళా సంఘాల గ్రూప్ వారు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా గద్వాల నియోజకవర్గం లో అధికార పార్టీ లోని నాయకులు రెండు వర్గాలుగా విడిపోవడం తో గ్రామాలలో కూడా రెండు వర్గాలుగా కార్యకర్తలు, నాయకులు విడిపోయి ఆధిపత్య పోరుతో గ్రామాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది.