calender_icon.png 28 October, 2024 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూదాన్ భూముల విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ

28-08-2024 03:18:44 AM

మహిళ సహా పలువురికి గాయాలు 

ఖమ్మం, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఖమ్మం శివారులోని భూదాన్ భూముల వ్యవహారంలో మంగళవారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఘర్షణలో మహిళతో సహా పలువురికి గాయాలయ్యాయి. తెలిసిన వివరాల ప్రకారం.. వెలుగుమట్ల వినోబానగర్‌లో భూదాన్‌భూములుగా ప్రాచుర్యంలో ఉన్న భూముల్లో కొందరు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వెలుగుమట్ల రెవెన్యూ సర్వేలో వాస్తవానికి 50 ఎకరాలకు పైగానే భూదాన్ భూములున్నాయి. 2014 నుంచి భూమలకు సంబంధించి పేదలు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదం నెలకొన్నది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. దీంతో వివాదం ముదిరింది.

దీనిపై కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆ భూములు తమవేనంటూ కోర్టును సైతం ఆశ్రయించారు. గుడిసెలు వేసుకున్న వారు మాత్రం భూదాన్ ట్రస్ట్ సభ్యులు ఆ భూములను పేదలకు కేటాయించారని చెప్తున్నారు. వివాదం కోర్టులో ఉండగానే మంగళవారం ప్రైవేట్ వ్యక్తులు జేసీబీలను వెంట తీసుకెళ్లి గుడిసెలను తొలగించేందుకు యత్నించారు. అనుకున్నట్లే కొన్నింటిని పడగొట్టారు. దీంతో గుడిసెలు వేసుకున్న వారు వాగ్వాదానికి దిగారు. అది కాస్తా రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పరస్పరం కర్రలతో దాడు చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. ఘర్షణలతో ఓ మహిళ తీవ్ర గాయాలయ్యాయి.  మరికొందరికి స్వల్పగాయాల య్యాయి. పోలీసుల జోక్యంతో పరిస్థితి అ దుపులోకి వచ్చింది. ఖమ్మం అర్బన్ పోలీసులు ఘర్షణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.