calender_icon.png 5 January, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెను ఇస్తే సరే.. లేదంటే డీసీఎంలో ఎక్కించుడే

11-10-2024 09:07:15 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): ఆయుధ పూజకు గొర్రెను ఇవ్వాలని గొర్రెల కాపరిని రైల్వే సిబ్బంది కోరగా గొర్రెల కాపరి సాసే మేరా అన్నారు. దీంతో రైల్వే సిబ్బంది గొర్రెల కాపరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న ఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. స్థానికులు బాధితుని కథనం ప్రకారం... కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ఉన్న రైల్వే సిబ్బంది ప్రతి ఏటా దసరా పండుగ సమయంలో గొర్రెను ఇవ్వడం గొర్రెల కాపరిని ఇవ్వలని కోరారు. దీంతో గొర్రెల కాపరి తమకు గొర్రెలు తక్కువగా ఉన్నాయని ఈసారి ఆయుధపూజ కోసం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. 

ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే ఈసారి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో గొర్రెల కాపరులపై రైల్వే సిబ్బంది ఆగ్రహించారు. అరగంట పాటు రైల్వే సిబ్బందికి గొర్రెల కాపరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైలు పట్టాల పక్కన గొర్రెలను మేపడం మానుకోవాలని లేకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాము కొత్తగా అడగడం లేదని ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే ఈసారి హాయిగా పూజకు ఇవ్వాలని కోరారు. మా రూల్ ప్రకారం మేం చేసుకుంటాం మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి అంటూ గద్దించడంతో గొర్రెల కాపర్లు వారి సంఘం ప్రతినిధులు వచ్చి సర్ది చెప్పారు. ప్రతి సంవత్సరం ఇచ్చినట్లగానే ఆయుధపూజకు గొర్రెను ఇస్తామని చెప్పడంతో వాగ్వాదం సద్దుమణిగింది.