calender_icon.png 2 November, 2024 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో కల్లోలం

02-11-2024 04:30:37 PM

జిల్లా కేంద్రంలో నిర్వహించిన కులగనన అభిప్రాయ సేకరణలో రభస

డిసిసి కొక్కిరాల విశ్వ ప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యాంనాయక్ వర్గీయుల మధ్య ఘర్షణ.

శ్యాం , అయన వర్గీయులను సమావేశం నుండి బయటకు పంపిన పోలీసులు.

ఆసిఫాబాద్ లో ఉద్రిక్తత....

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోనీ రోజ్ గార్డెన్ లో శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కులగణన అభిప్రాయ సేకరణ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తల మధ్య గొడవకు దారితీసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, అసిఫాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి శ్యాంనాయక్  వర్గీయుల మధ్య వాగ్వాదం పెరగడంతో ఒక్కరి పై ఒక్కరూ కుర్చీలు విసురుకున్నారు. ఆపై ఒకరిపై ఒకరు దాడులు  చేసుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్త గడ్డల సత్తయ్యకు గాయాలయ్యాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కల్పించుకొని శ్యాం నాయక్ తో పాటు ఆయన వర్గీయులను సమావేశం నుంచి బయటకు పంపించారు.

దీంతో రోడ్డు పై బైఠాయించి డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ కు వ్యతిరేకం నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలని శ్యామ్ నగర్ వర్గీయులు డిమాండ్ చేశారు. బయట సామ్నాకి వర్గీయులు నిరసన తెలుపుతున్నప్పటికీ ఫంక్షన్ హాల్ లో మాత్రం సమావేశం యధావిధిగా కొనసాగింది. ఘర్షణ వాతావరణం తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కాగజ్నగర్ డిఎస్పి రామానుజం సమ్మె వర్గీలను నచ్చచెప్పారు అయినప్పటికీ వారు నిరసనను విరమించుకోలేదు.  బుద్ధ స్వామి,  రవీందర్, సత్యనారాయణ, శ్రీనివాసరావు,ఎస్ఐలు రాజేశ్వర్, చంద్రశేఖర్ పాటు పోలీస్ బలగాలు ఫంక్షన్ హాల్ వద్ద పహారా ఉన్నారు