calender_icon.png 8 January, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

07-01-2025 01:54:54 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నాంపల్లిలో కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) కార్యకర్తల మధ్య మంగళవారం ఘర్షణ జరిగింది. ప్రియాంకగాంధీపై ఢిల్లీ బీజేపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయం ముట్టడికి రావడంతో బీజేపీ శ్రేణులు ఎదురుదాడి చేశారు. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసరడంతో ఒక బీజేపీ కార్యకర్త తలకు గాయమయింది. ఈ ఘటనతో బీజేపీ కార్యకర్తులు మరింత ఆగ్రహంతో ఊగిపోతు కర్రలతో వెంబడించారు. 

ప్రియాంక గాంధీ వాద్రాపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి(Delhi BJP leader Ramesh Bidhuriమరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  త్వరలో జరుగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రమేశ్ బిధూరి బీజేపీ తరుపున కల్కాజీ సెగ్మెంట్ నుంచి  పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీ జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న రమేశ్ బిదూరి వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా చేస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

గతంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ రోడ్లను హేమమాలిని చెంపల్లా నున్నగా చేస్తానని చెప్పి చేయలేకపోయారని రమేష్ బిధూరి విమర్శించారు. కానీ తాను అలా కాదని, తనను గెలిపిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంక గాంధీని ఉద్దేశించి ఆమె బుగ్గల్లా నున్నగా మారుస్తానంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రమేశ్ బిధూరి వ్యాఖ్యలపై ఘటుగా స్పందించిన కాంగ్రెస్ తమ నాయకురాలికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. బిధూరి వ్యాఖ్యాలు ఆర్ఎస్ఎస్ విలువలను ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు.