సూపర్ హీరో కథకు ఇతిహాసాన్ని జోడించి మంచి సక్సెస్ సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయన రూపొందించిన ‘హనుమాన్’ దానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ను రూపొందిస్తున్నారు. ‘శ్రీరాముడికి హనుమం తుడు ఇచ్చిన మాటేంటి?’ అనే అంశాన్ని కథాంశంగా తీసుకుని తెరకెక్కించనున్నారు. సీక్వెల్‌కు తేజ సజ్జా హీరో కాదు.. హనుమంతు పాత్రలోనే కనిపిస్తాడని ఇటీవల మేకర్స్ తెలిపారు.
అయితే సీక్వెల్ గురించి మేకర్స్ ఒక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేయనున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి పోషిస్తారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ విషయం పై నేడు స్పష్టత రానుంది.