calender_icon.png 28 October, 2024 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెయిటేజీపై క్లారిటీ ఇవ్వాలి

14-09-2024 12:29:14 AM

ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ ఖన్నా

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీలో ఎన్‌హెచ్‌ఎం(నేషనల్ హెల్త్ మిషన్) కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చే వెయిటేజీపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమా రాజేశ్ ఖన్నా ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 24 ఏండ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమకు వెయిటేజీగా 20 మార్కులకు బదులు 30 మార్కులు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం ఏఎన్‌ఎంల భర్తీలోనూ 30 మార్కులు వెయిటేజీ ఇచ్చిందని గుర్తుచేశారు. భవిష్యత్తులో భర్తీ చేయబోయే ఫార్మసిస్టు పోస్టులకు సైతం 30శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వాలని ఖన్నా విజ్ఞప్తి చేశారు.