- పంపకంపై డీల్ ఓకే!
- ఒంటరిగా పోటీ చేయం
- ఎంపీ సంజయ్‌రౌత్
ముంబై, అక్టోబర్ 21: మహారాష్ట్రలోని అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సీట్ల పంపకాలపై ఇండియా కుటమిలో విభేదాలు వచ్చాయంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్ చేశా యి. సోషల్ మీడియాలో వైరల్ అయి న వార్తలకు శివసేన(యూబీటీ) నేత సంజయ్‌రౌత్ పుల్‌స్టాప్ పెట్టారు.
ఎన్నికల్లో శివసేన(యూబీటీ) ఒంటరిగా పోటీ చేస్తుందం టూ వచ్చిన వార్తలన్నీ వట్టి ఊహాగానాలే అని సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్‌తో ఏకాభి ప్రాయం కుదిరిందని స్పష్టం చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 210 సీట్లపై మహా వికాస్ అఘాడి కూటమి ఏకాభిప్రాయానికి వచ్చిందన్నారు.
దీన్ని ఒక అపూర్వమైన విజయంగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసి.. మహారా ష్ట్రను లూటీ చేసిన శక్తులను ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహా వికాస్ అఘాడి కూటమిలో శివసేన(యూబీటీ), ఎన్సీపీ (శర ద్ పవార్), కాంగ్రెస్ ఉండగా.. మరోవైపు సీఎం ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతోపాటు బీజేపీ కూటమిగా ఏర్పాడిన వి షయం తెలిసిందే. కాగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవం బర్ 20న ఎన్నికలు జరగనున్నాయి.