calender_icon.png 1 November, 2024 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ల వివాదంపై స్పష్టతనివ్వాలి

12-05-2024 12:59:19 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని, రిజర్వేషన్ల వివాదానికి తెరదించాలంటే ప్రధాని చట్టసభల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సవరించి, రిజర్వే షన్లను రద్దు చేస్తుందని దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.

పదేళ్ల బీజేపీ పాలనలో బీసీల అభివృద్ధికి ఒక్క చిన్న పథకాన్ని కూడా రూపొందించలేదని, బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించమంటే కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను బీజేపీ అవమానపరిచిందని ఆరోపించారు. ఇప్పటికైనా బీజేపీ బీసీ వ్యతిరేక పంథా మార్చుకొని బీసీల అభివృద్దికి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, అనంతయ్య, ప్రణీత రాణి తదితరులు పాల్గొన్నారు.