calender_icon.png 24 February, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వర్ణ గోపురం ప్రారంభోత్సవంలో సీఎల్ రాజం దంపతులు

24-02-2025 01:08:50 AM

యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం ప్రారంభోత్సవంలో విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, ఎండీ విజయరాజం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులను వారు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి కొద్దిసేపు ముచ్చటించారు.

సీఎల్ రాజం దంపతులకు ఆలయ అర్చకులు స్వాగతం పలుకగా, వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానమామలై పీఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. వేద పండితులు రాజం దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.