దేశంలోకి మెక్సికో డ్రగ్ మాఫియా కంపెనీ
ఢిల్లీ శివారు ల్యాబ్‌లో డ్రగ్స్ తయారీ
నరమాంస భక్షణే ఈ గ్యాంగులో చేరే అర్హత
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దేశంలో టన్నులకొద్ది డ్రగ్స్ పట్టుబడుతున్నది. చాలాకాలంగా విమానాలు, పోర్టుల ద్వారా మాదకద్రవ్యాలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. కానీ, డ్రగ్స్ మాఫియా రూటు మార్చింది. ఇప్పు డు మన దేశంలోనే ఏకంగా ప్రత్యేక కంపెనీలు పెట్టి టన్నుల కొద్ది ప్రమాదకరకమైన డ్రగ్స్ తయారుచేస్తున్నారు. తాజాగా ఢిల్లీ శివారులోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశా రు. ఉత్తరప్రదేశ్ పరిధిలోకి వచ్చే గ్రేటర్ నోయిడాలోని గౌతమ్‌బుధ్ నగర్ జిల్లా కాస న పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం జరిపిన దాడుల్లో రహస్యంగా మెథాంఫెటస్ డ్రగ్‌ను తయారుచేస్తున్న ల్యాబ్‌ను గుర్తించారు. దాడుల్లో 95 కిలోల మెథాంపె టమైన్ డ్రగ్ తయారుచేసేందుకు ఉపయోగించే ముడిసరుకుతో పాటు అప్పటికే త యారైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకు న్నారు. ల్యాబ్‌లో పనిచేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు.
సీజేఎన్‌జీతో లింకులు
మెక్సికో కేంద్రంగా పనిచేసే అత్యంత క్రూరమైన కార్టెల్ డీ జలిస్కో నుయేవా జెనెరేసియన్ (సీజేఎన్‌జీ)తో ఈ ల్యాబ్‌కు సంబంధాలు బయటపడటం కలకలం సృష్టించింది. సీజేఎన్‌జీ పేరు చెప్తేనే అమెరికా సహా దాదాపు 30 దేశాల్లో పోలీసలు ఉలిక్కిపడుతారు. నరమాంసాన్ని కూడా తినగలవారినే తీసుకొంటారని 2022లో డైలీ బీస్ట్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దీన్నిబట్టే వారు ఎంత క్రూరులో తెలుసుకోవచ్చు. వీరివద్ద దేశాల సైనికులకంటే అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలు అమర్చిన వాహనాల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్‌ను దేశాలు దాటిస్తూ ఉంటారు. ప్రత్యర్థి ముఠాల్లోని సభ్యులను చంపటానికి ఏమాత్రం వెనుకాడరు. 2010 వరకు మెక్సికోలో అరాచకం సృష్టించిన మిలెనియో కార్టెల్ నుంచి విడిపోయిన డ్రగ్ డీలర్ ఎల్ మెంచో మెక్సికోలోని పశ్చిమ రాష్ట్రమైన జలిస్కోలో సీజేఎన్‌జీని స్థాపించాడు.
గుట్టురట్టు చేసిన ఎన్‌సీబీ అధికారులు పోలీసే డ్రగ్ డీలర్
ఢిల్లీలో పట్టుబడి డ్రగ్స్ తయారీలో తీహార్ జైల్లో పనిచేసిన ఓ వార్డెన్ పాత్ర కూడా ఉన్నదని డీడీజీ (ఆపరేషన్స్) జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. రైడ్స్ సమయంలో పరిశ్ర మలో ఉన్న ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారి తీహార్ జైల్ మాజీ వార్డెన్‌తో కలిసి డ్రగ్స్ పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు ఒప్పుకొన్నాడు. గతంలో డ్రగ్స్ సరఫరా కేసులో ఈ వ్యాపారి అరెస్టయ్యాడని, తీహాడ్ జైలులో అతడు ఉన్నప్పుడు జైలు వార్డెన్‌తో కలిసి ఒప్పందం చేసుకుని డ్రగ్స్ తయారీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ముంబైకి చెందిన కెమికల్ ఇంజినీర్‌తో కలిసి వీరు డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు తెలిసింది.